BREAKING
బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ కోకాకోలా బాట్లింగ్ సంస్థ సీసీఈపీపై ఈయూ యాంటీట్రస్ట్ దర్యాప్తు ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 15 శాతం వేతన పెంపు ప్రతిపాదన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి : డిసెంబర్ 1న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ : ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు ఆందోళనలు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం 2033 వరకు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓగా రెనే హాస్

బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్

Select Suryaa Now
బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్
సూర్య వాంకిడి : డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న బీసీల జనబేరీని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వాంకిడి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి జనబేరీకి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం లహుకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో ఓబీసీ కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 1, 2025న కేంద్ర కేబినెట్ సమావేశంలో రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, కుటుంబాల వివరాల సేకరణకు సంబంధించి విడుదల చేసిన ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ప్రస్తావన ఉన్నప్పటికీ ఓబీసీ కుటుంబాల ప్రస్తావన లేకపోవడం ఆందోళనకరమన్నారు.జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిట్ కోడ్ కేటాయించి, డ్రాప్‌డౌన్ విధానంలో కులాల వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో అనుసరించిన విధంగా కులాల జాబితాను జనగణన సిబ్బందికి ముందుగానే అందుబాటులో ఉంచితే కచ్చితమైన గణాంకాలు సేకరించేందుకు అవకాశం ఉంటుందన్నారు.దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల విషయంలో 50 శాతం పరిమితి కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోనూ బీసీలకు నష్టం కలుగుతోందని పేర్కొన్నారు.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు పార్టీలకు, జెండాలకు అతీతంగా బీసీలంతా తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం ఏకతాటిపైకి రావాలని కోరారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, దేశవ్యాప్తంగా బీసీలు డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో జరిగే జనబేరీలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మోహన్, సందీప్, అశోక్, ఈ. మోహన్, అఖిల్, గౌతమ్, అశ్విత్, రాహుల్, కార్తీక్, నాగరాజ్, సాయి తదితర విద్యార్థులు పాల్గొన్నారు.