BREAKING
ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు. సోషలిస్టులు పుంజుకుంటున్నా మితవాద కూటమికే ఆధిక్యం అల్ఫోర్స్ విద్యార్థి జాతీయస్థాయి డాడ్జ్‌బాల్ పోటీలకు ఎంపిక సిద్ధుగాడి లవ్ స్టోరీ విడుదల తేదీ ఖరారు.. నవంబర్ 27న థియేటర్లలోకి కాప్31 చర్చల ప్రతిష్టంభన తర్వాత కూడా బహుళపక్ష చర్చలు కొనసాగాలి బ్యాడ్మింటన్  ఛాంపియన్షిప్  పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థిని మహిళల మధ్య ఘర్షణ. క్లాడ్ ఏఐ రూపకర్త ఆంత్రోపిక్ రికార్డు ఐపీఓ.. నాస్‌డాక్‌లో ఘన అరంగేట్రం అల్లు అర్జున్, అట్లీ రాకా సినిమాలో బాలీవుడ్ స్టార్ గోవిందా.. కీలక పాత్రపై క్రేజీ అప్‌డేట్ ఈఎంఈఏ ప్యాకేజింగ్ వ్యాపారం విభజనకు ఇంటర్నేషనల్ పేపర్ బోర్డు ఆమోదం బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులకు ఆన్‌ ది జాబ్ ట్రైనింగ్

Select Suryaa Now
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ విద్యార్థులకు ఆన్‌ ది జాబ్ ట్రైనింగ్
సూర్య ఖానాపూర్ : విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, ఉపాధి అవకాశాలకు అవసరమైన ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు ఆన్‌ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏసీపీ, ఓఏ, ఈటీ విభాగాలకు చెందిన విద్యార్థులకు ఈ శిక్షణ అందిస్తున్నారు.నవంబర్, డిసెంబర్ నెలల్లో కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న వృత్తి విద్య థియరీ పాఠాలను క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టే అవకాశం కలుగుతుంది. వివిధ పనులపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు, భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోనున్నారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, వృత్తిపరమైన అనుభవాన్ని పొందడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందని కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆనందం, ఏజీఎంసీ సరిత, సీనియర్ లెక్చరర్లు శ్రీదేవి, హమీద్, ఒకేషనల్ అధ్యాపకులు నాగరాజు, జాకబ్ , రఘువీర్ కుమార్, టి. బాపు, సుభాష్, డి. నరహరి, జి. శ్రీనివాస్, డి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.