BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక ​పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా! అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వాపై దావా.. బార్ మేనేజర్‌పై దాడి ఆరోపణలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు కేపీహెచ్‌బీలో ఆకట్టుకున్న మంచు శివలింగం ప్రభుత్వ సెలవు రోజున తరగతులు..* *గురుకుల్ పాఠశాలకు తాళం ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పద్మాదేవేందర్ రెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు స్వేచ్ఛను లాక్కునే బంధాల నుంచి తప్పుకోవడం కష్టమే.. పెళ్లిపై నిత్యా మీనన్ క్లారిటీ దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ విస్తరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం అల్లాదుర్గం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక రెండోసారి అధ్యక్షుడిగా గోండ రఘుపతి

తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్

Select Suryaa Now
తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్

 

లింగాల: మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజలకు కనీస మరుగుదొడ్ల (పబ్లిక్ టాయిలెట్స్) సదుపాయం లేకపోవడం వల్ల ఎదురవుతున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్  డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటును కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
​భూమి సంబంధిత పనులు, వివిధ ధృవపత్రాలు మరియు ఇతర రెవెన్యూ సేవల కోసం ప్రతిరోజు వందలాది మంది ప్రజలు లింగాల తహసిల్దార్ కార్యాలయానికి వస్తుంటారనీ, వీరిలో మహిళలు, వృద్ధులు మరియు దివ్యాంగులు కూడా ఎక్కువగా ఉంటున్నారనీ అన్నారు. పనుల నిమిత్తం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో, ఆఫీసు ఆవరణలో కనీస పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారనీ తెలిపారు.​స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండటం అత్యవసరమన్నారు. ఈ విషయంపై తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులను ఆదేశించి, లింగాల ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పరిశుభ్రమైన పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి, నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.