BREAKING
బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ కోకాకోలా బాట్లింగ్ సంస్థ సీసీఈపీపై ఈయూ యాంటీట్రస్ట్ దర్యాప్తు ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 15 శాతం వేతన పెంపు ప్రతిపాదన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి : డిసెంబర్ 1న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ : ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు ఆందోళనలు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం 2033 వరకు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓగా రెనే హాస్

ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

Select Suryaa Now
ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం
సూర్య బేల : మండలంలోని ధోప్టాల గ్రామ ప్రజలు, రైతుల చిరకాల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. దశాబ్దాల కాలంగా ధోప్టాల ప్రాథమిక సహకార సంఘం సేవలు బేల మండల కేంద్రం నుంచే కొనసాగుతున్నాయి. దీంతో ధోప్టాల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులు సహకార సంఘానికి సంబంధించిన వివిధ పనుల కోసం బేల మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల రైతుల సమయం, ప్రయాణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.  సమస్యను గుర్తించిన ధోప్టాల గ్రామ సర్పంచ్ బోడకుంటి వెంకటమ్మ, రాకేష్ ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామంలోనే ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో  సోమవారం ధోప్టాల గ్రామంలో నూతన ప్రాథమిక సహకార సంఘం కేంద్రాన్ని  సర్పంచ్  వెంకటమ్మ రాకేష్  ప్రారంభించారు.ఇకపై గ్రామ రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్  అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ జితేందర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్,   మోరేశ్వర్, లక్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.