సూర్య,కౌటాల : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జిల్లా జడ్జి జి. అనూష ఆధ్వర్యంలో సామాజిక సామరస్య పరిష్కార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా ప్రజల మధ్య తలెత్తే సామాజిక సమస్యలు, వివాదాలను పరస్పర చర్చలతో సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం కొమురం మంతయ్య, దుర్గం జానకిరావు, బండి రాజేందర్ గౌడ్‌లను కమిటీ సభ్యులుగా నియమించారు. ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు ఈ కేంద్రం దోహదపడనుందని తెలిపారు.