BREAKING
బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్ డిసెంబర్‌లో థియేటర్లలోకి తిరువీర్ ‘భగవంతుడు’.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు అంతర్జాతీయ క్రీడల్లోకి రష్యా పునరాగమనానికి యూరప్ దేశాల అడ్డుకట్ట జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం బెల్జియం బడ్జెట్ చర్చలకు డిసెంబర్ 31 గడువు చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు సామాజిక సామరస్య పరిష్కార కేంద్రం ఏర్పాటు అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు జాంబియా ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నాకు ఇంకా పెళ్లి కాలేదు.. వైరల్ వీడియో కామెంట్‌పై డింపుల్ హయాతి స్పందన ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

ధాన్యం మళ్లింపుపై ఈడీ ఉక్కుపాదం: రూ.6,700 కోట్ల అక్రమాలపై దూకుడు

Select Suryaa Now
ధాన్యం మళ్లింపుపై ఈడీ ఉక్కుపాదం: రూ.6,700 కోట్ల అక్రమాలపై దూకుడు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6,700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దారి మళ్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖ, విజిలెన్స్ విభాగాలు నమోదు చేసిన కేసుల వివరాలను సేకరించిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో మరింత మంది మిల్లర్లపై కొత్తగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది.

రాష్ట్రంలోని 3 వేలకు పైగా రైస్ మిల్లులకు పౌరసరఫరాల శాఖ కేటాయించిన ధాన్యం ఎంత, తిరిగి మిల్లర్లు అప్పగించిన బియ్యం ఎంత అనే వివరాలను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ 300 మిల్లుల్లో నిర్వహించిన తనిఖీల నివేదికలను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటోంది. రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై నమోదైన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవల ఆమె నివాసంతో పాటు, ఆమె భాగస్వామిగా ఉన్న 'ఏఆర్‌ఎస్ ఇండస్ట్రీస్' మిల్లులో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.30 లక్షల నగదు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో, విదేశాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్న మిల్లర్లు ఆ డబ్బును రియల్ ఎస్టేట్, సినిమా రంగాల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణలో తేలింది. బినామీల పేర్లపై కొనుగోలు చేసిన స్థిర, చరాస్తులను గుర్తించి జప్తు చేసేందుకు ఈడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బకాయిల వసూలు కోసం రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఈడీ దాడులు ముమ్మరం కావడంతో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లలో తీవ్ర కలవరం మొదలైంది. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రైస్ మిల్లులపై సోదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.