BREAKING
బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ కోకాకోలా బాట్లింగ్ సంస్థ సీసీఈపీపై ఈయూ యాంటీట్రస్ట్ దర్యాప్తు ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 15 శాతం వేతన పెంపు ప్రతిపాదన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి : డిసెంబర్ 1న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ : ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు ఆందోళనలు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం 2033 వరకు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓగా రెనే హాస్

కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం

గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీఅపర్ణ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి కొత్తగా ఎన్నికైన డివిజన్ కార్పొరేటర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బయలుదేరారు. బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలోనే గుంటూరు నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీల సంక్షేమానికి, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని మైనారిటీ ప్రాంతాలతోపాటు నగరంలోని ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణకు నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మీఅపర్ణ సారథ్యంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని అన్నారు.  పార్టీ శ్రేణుల నినాదాలు, డప్పు వాయిద్యాల నడుమ భారీ ప్రదర్శనగా బయలు దేరిన ఎమ్మెల్యే నసీర్, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ లక్ష్మీఅపర్ణకు ఎమ్మెల్యే నసీర్ పుష్ఫగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందలు తెలిపారు.

 

సూర్య నాయక్