గుంటూరు పోస్టల్ డివిజన్‌కు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం
గుంటూరు : గుంటూరు పోస్టల్ డివిజన్ రాష్ట్రస్థాయిలో ఘన విజయం సాధించి విశేష గుర్తింపు పొందింది. అర్ధ సంవత్సరానికి సంబంధించిన మెయిల్స్ ఆపరేషన్స్ విభాగంలో గుంటూరు డివిజన్ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అర్ధ సంవత్సర పనితీరు ఆధారంగా రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం దక్కించుకుంది.పంచరత్న పోటీలు: తపాలా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో అకౌంట్ ఓపెనింగ్ విభాగంలో గుంటూరు డివిజన్ బహుమతి సొంతం చేసుకుంది. నవంబర్ 19, 20 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి డివిజనల్ హెడ్స్ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.పి. శ్రీదేవి చేతుల మీదుగా ఈ అవార్డులను గుంటూరు డివిజనల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ డబ్ల్యూ. నాగాదిత్య కుమార్ అందుకున్నారు. ఈ సందర్భంగా గుంటూరు డివిజనల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ నాగాదిత్య కుమార్ మాట్లాడుతూ, ఈ విజయాలు డివిజన్‌లోని ఉద్యోగులందరి అంకితభావం, నిరంతర ప్రయత్నాలు, సమిష్టి కృషి వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గుంటూరు డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
సూర్య నాయక్