BREAKING
బ్రిటిష్ పౌండ్ స్వల్ప పునరాగమనం నివేదా థామస్ శ్రీమతి ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న ఓటీటీలోకి వచ్చేస్తోంది శ్రీ సత్యసాయి తాగునీటి పంప్‌హౌస్ వద్ద ఘనంగా 101వ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు భక్తిపారవశ్యంలో అన్నదాన నారాయణ సేవ.. సేవా కార్యక్రమాలతో మార్మోగిన సాయినామ స్మరణ ఇటలీ ఎగ్జిట్ ట్యాక్స్ నిబంధనల సడలింపు అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల తర్వాత ఎన్టీఆర్ సినిమా.. సినీ వర్గాల్లో జోరుగా చర్చ కోకాకోలా బాట్లింగ్ సంస్థ సీసీఈపీపై ఈయూ యాంటీట్రస్ట్ దర్యాప్తు ఇంకొల్లు మండంలో 191 మంది పోటీ బంగ్లాదేశ్ గార్మెంట్ కార్మికులకు 15 శాతం వేతన పెంపు ప్రతిపాదన జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి : డిసెంబర్ 1న టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా మహాసభ : ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధస్సు ఆందోళనలు తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి - బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి సలేశ్వరం ముదిరాజ్ డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం.. ‘పాకెట్ రాకెట్స్’ ఆల్బమ్‌తో నిహారిక కొత్త ప్రయాణం 2033 వరకు ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓగా రెనే హాస్

చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి

Select Suryaa Now
చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి


*ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి*  ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు పురపాలక సంఘం ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు తో చేనేతపురం అభివృద్ధికి తోడ్పాటు అందించేలా ఉందని మీరు అందించిన స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకొని పట్టణాభివృద్ధికి కంకణం కట్టుకొని పొరపాలక సంఘం పాలకవర్గంతో పాటు తన వంతు సహకారం అందించి మా ముందున్న కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ 40 మంది కౌన్సిల్ సభ్యులు కూటమికి ఉన్నారని ప్రతి సమస్య చైర్మన్ మాచాని సునీత అధ్యక్షతన ఆమోదం పొంది పరిష్కారం మార్గం ఏర్పడుతుందన్నారు. రానున్న రెండున్నరేళ్ళలో కూటమి పార్టీ అధికారంలో పట్టణమంతా అభివృద్ధి బాట పట్టించి సార్వత్రిక ఎన్నికలకు ఓటు అడగడానికి వస్తానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు కూటమి నాయకులను నమ్మి మునిసిపాలిటీ పట్టం కట్టారని దానిని వమ్ము చేయకుండా ప్రతి వార్డు అభివృద్ధికి బాటలు వేయడమే కాకుండా ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ సంక్షేమాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాచాని సునీత, వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తురిగల్ నజీర్ అహమ్మద్ లతోపాటు కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బీవీ ని ఘనంగా సన్మానించారు. గెలుపొంది ప్రమాణస్వీకారం చేసిన వార్డు సభ్యులు, వైస్ చైర్మన్ అభ్యర్థులకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమంతో మున్సిపల్ కౌన్సిల్ హాల్ కోలాహలంగా మారింది.
*A. R. శరత్ కుమార్, సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా.*