ఎన్ హెచ్ ఎం ఉద్యోగిని అరుణ కుటుంబానికి అండగా ఎన్ హెచ్ ఎం జేఏసీ
నాగర్‌కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: నాగర్ కర్నూల్ మండలంలోని పెద్దమొద్దునూరులో విధులు నిర్వహిస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగిని అరుణ భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఎన్.హెచ్.ఎం జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆమె కుటుంబానికి సోమవారం ఆర్థిక సాయం అందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరి సహకారంతో సేకరించిన రూ 34 వేల ఆర్థిక సహాయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కృష్ణ అరుణ కు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ కష్టకాలంలో ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడంఅభినందనీయమని పేర్కొన్నారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల మధ్య ఉన్న ఐక్యత, మానవత్వం, పరస్పర సహకారం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎన్.హెచ్.ఎం జేఏసీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, జిల్లా నాయకులు డా. జగన్, హైమవతి, భాగ్య, డా రామకృష్ణ రెడ్డి, డా సంధ్య ప్రకాష్, షాహిన్ పాల్గొన్నారు.
-----