BREAKING
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు పి. కొత్తకోట పంచాయతీ సర్పంచిగా పరదేశి ఏకగ్రీవ ఎన్నిక ​పంచాయతీ అభివృద్ధి చేయడమే నా ధ్యేయం వెల్దుర్తిలో రసవత్తరంగా పంచాయతీ పోరు! బరిలో 152 మంది సర్పంచ్, 565 మంది వార్డు అభ్యర్థులు నామినేషన్ల పరిశీలన పూర్తి.. బొమ్మిరెడ్డిపల్లి, పుల్లగుమ్మిలో ఏకగ్రీవ దిశగా! అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి బాడంగి అభివృద్ధికి నిధులు.. ప్రతి ఇంటికీ తాగునీరు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు హాలీవుడ్ దర్శకుడు ఆంటోనీ ఫుక్వాపై దావా.. బార్ మేనేజర్‌పై దాడి ఆరోపణలు కార్తీక పౌర్ణమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దంపతులు కేపీహెచ్‌బీలో ఆకట్టుకున్న మంచు శివలింగం ప్రభుత్వ సెలవు రోజున తరగతులు..* *గురుకుల్ పాఠశాలకు తాళం ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పద్మాదేవేందర్ రెడ్డి కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు స్వేచ్ఛను లాక్కునే బంధాల నుంచి తప్పుకోవడం కష్టమే.. పెళ్లిపై నిత్యా మీనన్ క్లారిటీ దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్ విస్తరణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం అల్లాదుర్గం మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక రెండోసారి అధ్యక్షుడిగా గోండ రఘుపతి

చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు

Select Suryaa Now
చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలకు జరుగుతున్న అన్యాయం, థియేటర్ల కేటాయింపులో చూపుతున్న వివక్షపై నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ గళమెత్తారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాను నిర్మించిన ‘ఓ అందాల రాక్షసి’ చిత్రానికి గత ఏడాదిన్నర కాలంగా తగినన్ని థియేటర్లు, షోలు లభించకపోవడం వల్ల తాను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నట్లు ఆయన తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద ఎత్తున థియేటర్లు, ప్రైమ్ టైమ్ షోలు కట్టబెడుతూ, చిన్న నిర్మాతలు మరియు కొత్త దర్శకుల చిత్రాలను పూర్తిగా విస్మరిస్తున్నారని షెరాజ్ మెహదీ ఆరోపించారు. థియేటర్లు, ప్రదర్శన సమయాల్లో సమాన అవకాశాలు లేకపోవడం వల్ల ఆరోగ్యకరమైన పోటీ దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు. థియేటర్లలో సరైన స్థాయిలో సినిమా విడుదల కాకపోతే ఓటీటీ, శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల రూపంలో వచ్చే ఆదాయం కూడా నిలిచిపోతోందని, ఫలితంగా చిన్న నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రక్షణ లేకుండా పోతోందని వివరించారు.

మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్ల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించాలని, బంధుప్రీతి మరియు వివక్షపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని షెరాజ్ మెహదీ ప్రభుత్వాన్ని కోరారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, విడుదల తర్వాత ఎదురయ్యే నష్టాల్లో కనీసం 20 నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం భరించేలా సబ్సిడీ విధానాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా హైదరాబాదీ భాషా చిత్రాలకు కూడా సమాన ప్రోత్సాహం అందించాలని కోరారు.

కలెక్టర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షెరాజ్ మెహదీ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర నిర్మాతల మండలి నేత సి. కళ్యాణ్‌పై ఘాటు విమర్శలు గుప్పించిన ఆయన, చిన్న నిర్మాతల సమస్యలను పరిష్కరించలేనప్పుడు పదవుల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నిస్తూ ఛాంబర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్న సినిమాలపై క్యూబ్ రేట్ల భారాన్ని తగ్గించాలని, ఈ రంగంలో పనిచేసే వారికి ప్రభుత్వ సహకారంతో హెల్త్ కార్డులు అందేలా కృషి చేస్తానని తెలిపారు. తమ న్యాయపోరాటం కోర్టులోనూ కొనసాగుతోందని, త్వరలోనే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.