BREAKING
బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్ డిసెంబర్‌లో థియేటర్లలోకి తిరువీర్ ‘భగవంతుడు’.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు అంతర్జాతీయ క్రీడల్లోకి రష్యా పునరాగమనానికి యూరప్ దేశాల అడ్డుకట్ట జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం బెల్జియం బడ్జెట్ చర్చలకు డిసెంబర్ 31 గడువు చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు సామాజిక సామరస్య పరిష్కార కేంద్రం ఏర్పాటు అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు జాంబియా ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నాకు ఇంకా పెళ్లి కాలేదు.. వైరల్ వీడియో కామెంట్‌పై డింపుల్ హయాతి స్పందన ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

ట్రైనీ డీఎస్పీలకు ఎస్పీ సూచనలు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి

Select Suryaa Now
ట్రైనీ డీఎస్పీలకు ఎస్పీ సూచనలు.. ప్రజలకు మెరుగైన సేవలందించాలి

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా..పోలీసింగ్ విధానాలు, క్షేత్రస్థాయి శిక్షణతో సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
24 వారాల పాటు జిల్లాలోని వివిధ పోలీస్ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందనున్న ట్రైనీ డీఎస్పీలు.
పోలీస్ శాఖలో విధులు, బాధ్యతలు, పోలీసింగ్ విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు.పోలీస్ శిక్షణలో భాగంగా 24 వారాల పాటు వివిధ పోలీస్ విభాగాల్లో క్షేత్రస్థాయి ప్రాక్టికల్ శిక్షణ పొందేందుకు జిల్లాకు కేటాయించబడిన ట్రైనీ డీఎస్పీలు పి.రవికుమార్, బి.సందీప్ నాయక్ లు సోమవారం రిపోర్ట్ చేశారు.ఈ సందర్భంగా వారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ట్రైనీ డీఎస్పీలకు జిల్లాలో కేటాయించిన వివిధ ప్రాక్టికల్ ట్రైనింగ్ యూనిట్లు, ఆయా విభాగాల పనితీరు, విధులు, బాధ్యతలు, పోలీస్ శాఖ నిర్వహించే కార్యకలాపాల గురించి వివరించారు. శిక్షణ కాలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పోలీస్ శాఖలోని ప్రతి విభాగం పనితీరుపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ విధులు, కేసుల నమోదు, నేర పరిశోధన, నిందితుల గుర్తింపు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు విధానాలు, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకోవాలని తెలిపారు.
అదేవిధంగా ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు విధులు, ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, మహిళలు, బాలల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
24 వారాల శిక్షణ కాలంలో వివిధ పోలీస్ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులను ప్రత్యక్షంగా పరిశీలించాలని, ప్రతి అంశాన్ని ఆసక్తితో నేర్చుకుంటూ భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించే సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.