telangana
జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు
సూర్య, జన్నారం : ఆసిఫాబాద్ లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో జన్నారం స్లేట్ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్ కరాటే అండ్ కుంగ్ ఫు ఛాంపియన్షిప్ 2026 జాతీయ స్థాయి పోటీల్లో మండలంలోని స్లేట్ హైస్కూల్ అలాగే స్లేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరిచి విజయకేతనం ఎగరవేయడం జరిగిందని స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా స్లేట్ విద్యార్థులు పట్టుదలతో ప్రత్యేక గుర్తింపు పొంది ముఖ్యంగా టీమ్ కటా విభాగంలో స్లేట్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్రథమ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా స్లేట్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటూ తృతీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. జాతీయస్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాలు సాధించడంతో పాఠశాలకే గర్వకారణంగా నిలిచిందని, ఈ విజయాలు విద్యార్థుల నిరంతర సాధనకు కరాటే శిక్షణలో చూపిన అంకితభావానికే నిదర్శనంగా నిలిచాయని అన్నారు. మొదటి స్థానంలో అదృష్ట, అక్షర, మ్రిడా యాదవ్, తృతీయ స్థానంలో రిశ్విక్, హరియన్, ధనుష్, ఆదిత్య, వైభవ్ కృష్ణ, కుశాల్ విజయకేతనం ఎగురవేశారని ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. అభినందించిన వారిలో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డైరెక్టర్ ఏనుగు రజిత రెడ్డి, స్లేట్ హైస్కూల్ ప్రిన్సిపల్ ప్రియా శివ, స్లేట్ స్కూల్ ప్రిన్సిపల్ షిరిన్ ఖాన్, కరాటే మాస్టర్ బచ్చల కృష్ణ, ఉపాధ్యాయులు రాజశేఖర్, సంతోష్ లు ఉన్నారు.