BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

కాంగ్రెస్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం - డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్

Select Suryaa Now
కాంగ్రెస్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం - డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్
సూర్య కరీంనగర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్న బీజేపీ నాయకులు ముందుగా ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఉన్న రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం బీజేపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు నిరంతరం కృషి చేసిందని గుర్తుచేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు.