BREAKING
బీసీ జనబేరీకి భారీగా తరలిరావాలి - బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు లోబడే లహుకుమార్ డిసెంబర్‌లో థియేటర్లలోకి తిరువీర్ ‘భగవంతుడు’.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు అంతర్జాతీయ క్రీడల్లోకి రష్యా పునరాగమనానికి యూరప్ దేశాల అడ్డుకట్ట జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం బెల్జియం బడ్జెట్ చర్చలకు డిసెంబర్ 31 గడువు చేనేతపురం అభివృద్ధి మా ముందున్న కర్తవ్యం.. ఎమ్మెల్యే బి వి చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో వివక్ష.. హైదరాబాద్ కలెక్టర్‌కు దర్శకుడు షెరాజ్ మెహదీ ఫిర్యాదు సామాజిక సామరస్య పరిష్కార కేంద్రం ఏర్పాటు అత్యంత వైభవంగా శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం దండు మల్కాపురంలో యాదవుల సదర్‌ సంబరాలు జాంబియా ప్రతిపక్ష నేతపై రాజద్రోహం కేసు కోలాహలంగా మేయర్ లక్ష్మీఅపర్ణ, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నాకు ఇంకా పెళ్లి కాలేదు.. వైరల్ వీడియో కామెంట్‌పై డింపుల్ హయాతి స్పందన ప్రాథమిక సహకార సంఘం కేంద్రం ప్రారంభం

డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్

Select Suryaa Now
డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన:  జిల్లా కలెక్టర్

గుంటూరు : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా తుది జాబితాను డిసెంబరు 22న విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ సి యం సాయికాంత్ వర్మ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి పాల్గొన్నారు. ఎస్ ఐ ఆర్, ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికల గురించి సమీక్షించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందించని ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, డిసీజ్డ్ (ఏ,ఎస్,డి,డి) జాబితాలో ఉన్న వారు నవంబరు 30వ తేదీ లోపు సమర్పించాలన్నారు. కొత్త వారి నుండి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. డిసెంబరు 10వ తేదీ లోగా విచారణలు పూర్తి చేసి అర్హులను జాబితాలో చేర్చడం జరుగుతుందన్నారు.ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు కావడానికి డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం ఉంటుందని గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఇ.ఆర్.ఓ  జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల, ఆపై స్థాయిలో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులన్నారు. భారత ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానిక నివాసం ఉన్నప్పుడు మాత్రమే ఓటరుగా అర్హులుగా పరిగణింపడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2026 నవంబరు 1వ తేదీకి ముందు ఆరు సంవత్సరాల నుండి వృత్తిలో కొనసాగాలని అందులో కనీసం మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, ఆపై స్థాయిలో బోధన అనుభవం ఉండాలని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అర్హత కలిగి ఉంటారని, వారికి జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ), కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ నిర్ధారణ చేయాలని వివరించారు. ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చునని లేదా ఫారం 19 పూర్తి చేసి ఏ.ఈ.ఆర్.వోలు ఉన్న స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించవచ్చని తెలిపారు.

 

సూర్య నాయక్