BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తాం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Select Suryaa Now
సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తాం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

 గుంటూరు : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు పాలనా స్ఫూర్తితో ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని నూతనంగా గెలిచిన ఎన్డీయే కూటమి కార్పొరేటర్లకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, డిప్యూటీ మేయర్‌తో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీగా తరలివెళ్లాయి.ఈ సందర్భంగా శ్రీనివాసరావు పేటలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరంగుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణస్వీకార మహోత్సవం సందర్భంగా ముందుగా అన్న ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించి, ఆయన ఆశీస్సులు తీసుకుని కార్యక్రమానికి బయలుదేరామని, పరిపాలన అంటే ఎలా ఉండాలో ఎన్టీఆర్‌ను, అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ పాలన ఎలా సాగించాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ప్రజలు అందించిన ఈ విజయాన్ని బాధ్యతగా భావిస్తూ, రానున్న రోజుల్లో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలన స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ గుంటూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజల మన్ననలు పొందేలా పనిచేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్, ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

 

సూర్య నాయక్