BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

Select Suryaa Now
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

 

బాడంగి, నవంబరు 23 (మేజర్ న్యూస్): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బాడంగి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల విధులకు ఉత్తర్వులు పొందిన 213 మందిలో 187 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, ఎంపీడీఓ శ్రీలత తెలిపారు.

మండలంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో సొంత మండలం బాడంగి అయిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల విధులకు ఉత్తర్వులు పొందిన ఉద్యోగులు ఫెసిలిటేషన్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్సై పి. సూర్యకుమారి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.