BREAKING
లిబియా తీరంలో రష్యా యుద్ధనౌక మునిగిపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన డిసెంబరు 22న ఎస్.ఐ.ఆర్ తుది జాబితా ప్రకటన: జిల్లా కలెక్టర్ నేపాల్‌కు రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం అర్హులందరికీ బీమా రక్షణ కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పింఛన్ల మంజూరీలో అనర్హులను తొలగించాలి వెల్లూరు సీఎంసీలో దేశంలోనే తొలి హ్యూమన్ మెటబాలిక్ ఛాంబర్ ప్రారంభం జాతీయస్థాయి కరాటే పోటీల్లో విజయభేరి మోగించిన స్లేట్ హైస్కూల్ విద్యార్థులు నేపాల్ పర్యటనకు ప్రధాని మోదీకి ఆహ్వానం వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరే ప్రధాన లక్ష్యం: సీఎండీ పి. పుల్లారెడ్డి పండుగ సీజన్‌లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక శ్రీ రామలింగేశ్వర స్వామికి వెండి విరాళం.. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎల్లూరు సర్పంచ్ చప్పిడి రవీందర్ నగరం మండలంలో 42,477 మంది ఓటర్లు ప్రమాద బీమాతో బాధిత కుటుంబానికి అండగా గాయత్రి బ్యాంకు

గ్రామీణ అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే – నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్.

Select Suryaa Now
గ్రామీణ అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు కూటమికే – నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్.
సూర్య న్యూస్ అద్దంకి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్ పేర్కొన్నారు. అద్దంకి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగుతాయని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం, దాడులు, దౌర్జన్యాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని, తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారని అన్నారు. సుమారు 40 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
2024 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా కూటమి పార్టీలకు పట్టం కట్టిన ప్రజలు, ప్రస్తుతం బ్యాలెట్ ద్వారా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. రేపు జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధిలో గ్రామాలే కీలకం...
అద్దంకి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ప్రతి గ్రామాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూటమి ప్రభుత్వం సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నారని గంగాధర్ తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు జాగర్లమూడి యలమందరావు, జనసేన నియోజకవర్గ నాయకులు గోరంట్ల సాయి, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు