పొన్నూరులో ఫెర్టిలైజర్ డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్ పై శిక్షణ కార్యక్రమం........ మాట్లాడుతున్న ఏ డి ఏ వి రామకోటేశ్వరి
పొన్నూరు మేజర్ న్యూస్:-కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యఫ్ యఫ్ ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ) యాప్‌పై డివిజన్‌లోని ప్రైవేట్ డీలర్లకు, రైతు సేవా కేంద్ర సిబ్బందికి సోమవారం శిక్షణకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పొన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వి. రామకోటేశ్వరి పాల్గొని ఫర్టిలైజర్ డీలర్ లకు శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ......ఈ యాప్ ద్వారా రైతులు తమ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యఫ్ యఫ్ ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలన్నారు.తమ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలోని ఏ డీలర్ వద్ద నుంచైనా ఎరువులు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంటుందని తెలిపారు.
రైతులు తమ ఫార్మర్ ఐడీ / ఆధార్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుందని, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ పూర్తవుతుందని అన్నారు ఆధార్‌కు అనుసంధానమైన పొలాల విస్తీర్ణాన్ని బట్టి కేటాయించిన ఎరువులను రైతులు కొనుగోలు చేయవచ్చని వివరించారు. తమకు నచ్చిన డీలర్ వద్ద కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ పొందాల్సి ఉంటుందని తెలిపారు.ఈ యాప్ ద్వారా యూరియా, డీఏపీ మాత్రమే కాకుండా కాంప్లెక్స్ ఎరువులతో పాటు అన్ని రకాల ఎరువులను కొనుగోలు చేయవచ్చని అన్నారు . ఈ విషయంలో రైతులకుసహాయపడటానికి ప్రతి డీలర్ వద్ద సహాయక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
యఫ్ యఫ్ ఎస్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సమీప రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో కాకుమాను మండల వ్యవసాయ అధికారి వి. సుధాకర్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- సిలార్