అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం
సూర్య- బిక్కనూర్ : మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పతక ఆన్ లైన్ ప్రక్రియను సోమవారం గ్రామ సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబా బీమా పథకాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇందిరమ్మ కుటుంబ బీమా వల్ల కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి భార్గవ్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు