telangana
సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
సూర్య,లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను సోమవారం లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ కౌడ రవీందర్,సొసైటీ చైర్మన్ బుర్ర నారగౌడ్ లు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి నుండి శివాలయం వరకు ఉన్న రోడ్డు చాలా కాలంగా అధ్వాన్నంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ముఖ్యంగా వర్షాకాలంలో బురద,గుంతలతో నడవడానికి కూడా వీలు లేకుండా ఉండేదని అన్నారు.ఈ సమస్యను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి 25 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు.నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేమదన్ మోహన్ నియోజకవర్గ అభివృద్ధికి, మండలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.లింగంపేట్ మండల అభివృద్ధికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు వంజరి ఎల్లమయ్య,దశరథ నాయక్,నయీమ్,వాహబ్,దూరిశెట్టిఅశోక్,రవిగౌడ్,నగేష్,రాజు, సొసైటీ డైరక్టర్స్ ఏదుల్,లక్ష్మినారాయణ,భైరయ్య,దేవిదాస్,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.