BREAKING
నేపాల్ వరదల పునర్నిర్మాణానికి రూ.24 వేల కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజల మద్దతు: టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి పొన్నూరులో ఫెర్టిలైజర్ డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్ పై శిక్షణ కార్యక్రమం........ మాట్లాడుతున్న ఏ డి ఏ వి రామకోటేశ్వరి దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి

ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన

Select Suryaa Now
ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన

 

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
నెల్లూరు స్థానిక గణేష్ ఘాట్ వద్ద సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న మహా కార్తీక దీపోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పూర్వ కోఆర్డినేటర్ మల్లెల శ్రీహరి కుంకుమార్చన విశిష్టతను వివరిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ కే. వెన్నెల మాట్లాడుతూ, లోక కల్యాణం, సమాజ శ్రేయస్సు కోసమే సామూహిక కుంకుమార్చన మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గౌరవ సలహాదారు సుజాతమ్మ మాట్లాడుతూ, చంద్ర సహోదరి, సోమ సహోదరి అయిన మహాలక్ష్మి అమ్మవారికి కార్తీక సోమవారం నాడు అర్చనలు నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు.
ఉపాధ్యక్షులు జయప్రద మాట్లాడుతూ, కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలందరికీ పూజా సామాగ్రిని ఉచితంగా అందించామని చెప్పారు. మంగళవారం సుమారు లక్ష మంది భక్తులు పాల్గొనే మహా కార్తీక దీపోత్సవానికి కూడా దీప వస్తు సామాగ్రిని సమకూరుస్తున్నామని, విచ్చేసే భక్తులందరికీ ప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కోడూరు జయరామయ్య, ముక్కాల వ్యాస్ ప్రసాద్, చింతాల మల్లికార్జున, ఏ.వి.ఆర్. మోహన్ రావు, పోలయ్య తదితర సమితి కార్యకర్తలు పాల్గొన్నారు.