BREAKING
నేపాల్ వరదల పునర్నిర్మాణానికి రూ.24 వేల కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలకు ప్రజల మద్దతు: టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి పొన్నూరులో ఫెర్టిలైజర్ డీలర్లకు ఎఫ్ ఎఫ్ ఎస్ పై శిక్షణ కార్యక్రమం........ మాట్లాడుతున్న ఏ డి ఏ వి రామకోటేశ్వరి దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి నసురుల్లాబాద్ ను కరువు మండలం గా ప్రకటించాలి. జలాల్పూర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అంతంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ఆకుల కల్పన చంద్రశేఖర్ కార్తీక దీపకాంతులతో వెలిగిన నవనాథ సిద్ధులగుట్ట - తెల్లవారుజాము నుంచే  పోటెత్తిన భక్తులు ణేష్ ఘాట్‌లో మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన విరాళాల సేకరణ దాతను సన్మానించిన హిందూ జాగృతి సభ్యులు ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు ఎలినో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి – ఆర్మూర్ సబ్‌ కలెక్టర్‌కు ఏఐయూకేఎస్‌ నాయకుల వినతి

ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు

Select Suryaa Now
ఏఐతో వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌లో కొత్త ఆవిష్కరణలు

నరసరావుపేట: నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏఐ ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యాపకులకు అవగాహన కల్పించేందుకు వారం రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌డీపీ) సోమవారం ప్రారంభమైంది. ‘ఎమర్జింగ్‌ ఏఐ టెక్నిక్స్‌ ఇన్‌ వీఎల్‌ఎస్‌ఐ అండ్‌ సీఎంఓఎస్‌ డిజైన్‌’ అంశంపై ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. వీటీఏపీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొని రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు. వీఎల్‌ఎస్‌ఐ, సీఎంఓఎస్‌ డిజైన్‌ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం, ఆధునిక సాంకేతిక పరిణామాలు, నూతన ఆవిష్కరణలు, వాటి అనువర్తనాలపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌కు చెందిన టెక్‌ఫ్లూయెంట్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కళాశాల ఈసీఈ, ఈఈఈ విభాగాలు, ఐఈఈఈ విద్యార్థి విభాగం, ఐక్యూఏసీ సంయుక్త ఆధ్వర్యంలో బ్లాక్‌-3లోని ఈసీఈ సెమినార్‌ హాల్‌లో శిక్షణ తరగతులు జరుగుతాయి. ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులకు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన పెరగడంతో పాటు బోధన, పరిశోధనలో నూతన పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

మల్లికార్జున రావు పల్నాడు  జిల్లా ఇన్చార్జి