.డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్
.డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ని కలిసి వినతి పత్రం సమర్పించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ రాష్ట్ర అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి.. ప్రస్తుతం జోనల్ స్థాయిలో పదోన్నతులు, రిటైర్మెంట్ ల ద్వారా ఖాళీ అయిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎక్స్టెన్షన్ మీడియా అధికారుల పోస్టులు(డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మరియు డిప్యూటీ డెమో) త్వరతగతిన అర్హులైన వారికి సీనియారిటీ ప్రకారం పదోన్నోతుల ద్వారా భర్తీ చేయుటకు అన్ని జోన్ల రీజినల్ డైరెక్టర్స్ వారికి తగు ఆదేశాలు జారీ చేయవలసినదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ - అమరావతి రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ. వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - చేజెర్ల సుధాకర్ రావు ఈరోజు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ ఆర్. వెంకటరమణ సార్ గారిని విజయవాడ, చుట్టుగుంట కార్యాలయం, డైరెక్టర్ గారి ఛాంబర్ లో కలిసి డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ సమస్యల వినతి పత్రం సమర్పించడం జరిగినది. అందులకు డైరెక్టర్ సార్ గారు సానుకూలంగా స్పందించి, త్వరలో సమస్యలు పరిష్కరిస్తాని హామీ ఇవ్వడం జరిగినది. మా సమస్యలపైన సానుకూలంగా స్పందించి, పరిషరిస్కరిస్తామని హామీ ఇచ్చినందులకు డైరెక్టర్ వెంకటరమణ సార్ గారికి కృతజ్ఞతలు తెలియచేసి, రాష్ట్ర అసోసియేషన్ తరపున మర్యాద పూర్వకంగా శాలువా తో సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమం లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డబ్ల్యూ. వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - చేజెర్ల సుధాకర్ రావు, కార్యాలయం డిప్యూటీ డెమో శివరామ రాజు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ - అనిత పాల్గొన్నారు.