telangana
ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కు పంపిణి
సూర్య కమ్మర్ పల్లి : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీకార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలందర్ చేతుల మీదుగా చెక్కుని బైండ్ల తిరుమల కి పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన లో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి, నిరుపేదల సంక్షేమనికి నిరంతరం కృషి చేస్తుంది, అలాగే బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తున్న కాంగ్రెస్ పార్టి బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో,ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, ఇందిరమ్మ కమిటీ మెంబెర్ ఎనేడ్ల గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ల్,సాదుల్ల,క్రాంతి రెడ్డి,బైండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు