జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు
సూర్య జూలపల్లి :రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలంలోని వడుకాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ నెల 19న సిద్దిపేటలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు జీవిత బీమా భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లూరి ప్రశాంతి, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్‌రావు, తహసీల్దార్ దత్తుప్రసాద్‌రావు, ఎంపీడీవో పద్మజ, మండల విద్యాధికారి లక్ష్మణ్, వ్యవసాయ శాఖ అధికారిణి ప్రత్యూష, ఏపీఎం సుధాకర్, ఏపీఓ సదానందం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లక్ష్మి, హౌసింగ్ ఏఈ సాహిత్య, ఆర్ అండ్ బీ ఏఈ అన్వేష్, ఉపసర్పంచ్ మొగురం రాజేష్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ మహంకాళి తిరుపతి, కాచాపూర్ ఉపసర్పంచ్ దాడి మనోహర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్మ పోచాలు, కాంగ్రెస్ నాయకులు బండి స్వామి, జెట్టి సతీష్, మల్లారపు సంతోష్, కోరుకంటి మల్లయ్య, మండల శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.