ఎల్లంపేట మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ల బదిలీ
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవల కోసమే బదిలీలు
మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి
మేడ్చల్, మేజర్ న్యూస్( అక్టోబర్ 5): ఎల్లంపేట మున్సిపాలిటీలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు ప్రజలకు సేవలను వేగంగా అందించేందుకు వార్డు ఆఫీసర్లను బదిలీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు.నూతనకల్ వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉమాదేవిని ఎల్లంపేట వార్డుకు, ఎల్లంపేట వార్డు ఆఫీసర్‌గా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డిని నూతనకల్ వార్డుకు బదిలీ చేశారు. అలాగే రావల్‌కోల్ వార్డు ఆఫీసర్‌గా ఉన్న అపర్ణను రాజబొల్లారం వార్డుకు, రాజబొల్లారం వార్డు ఆఫీసర్‌గా ఉన్న రవీందర్‌రెడ్డిని రావల్‌కోల్ వార్డుకు బదిలీ చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.వార్డుల వారీగా పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటు ప్రజలకు అందాల్సిన మున్సిపల్ సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బదిలీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించే వార్డు ఆఫీసర్లు తమ పరిధిలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
రిపోర్టర్ తలారి శివకుమార్.