సింగారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
నారాయణపేట, సూర్యన్యూస్:
నారాయణపేట మండలం, సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చాలా రోజుల తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో కూడిన రేషన్ కార్డులు చేతికి అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో మొత్తం 560 కొత్త రేషన్ కార్డుల్లో 350 కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు జిపిఓ విజయకుమార్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి, ఉపసర్పంచ్ లక్ష్మప్ప, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ యంపిటిసి నగేష్, మాజీ ఉపసర్పంచ్ బాల్ రెడ్డి, సిద్దప్ప, డీలర్ సుధాకర్ రెడ్డి, చంద్రకాంత్, భగీరథ్, వినోద్ కుమార్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.