BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు

Select Suryaa Now
ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు

విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 63వ డివిజన్ రాజీవ్‌నగర్‌లో ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.9 కోట్ల విలువైన ఎల్‌ఓసీలు, చెక్కులు అందజేశామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయించినప్పుడు అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారుల ద్వారా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అధికారం అలంకారం కాదని, ప్రజల పట్ల జవాబుదారీతనంతో సేవ చేయడం తమ బాధ్యతని బొండా ఉమా పేర్కొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.