BREAKING
అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా తాడిగడపలో సేవా జ్యోతి యాత్ర - ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

అక్రమార్కులపై ఉక్కు పాదం

Select Suryaa Now
అక్రమార్కులపై ఉక్కు పాదం

మరిపెడ ఎస్సై సతీష్ 
- కార్డన్‌ సెర్చ్‌లో 3 బైక్‌లు సీజ్‌
- 500 లీటర్ల బెల్లంపానకం ధ్వంసం, 30 లీటర్ల నాటుసారా స్వాధీనం

మరిపెడ ప్రతినిధి, వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంటుందని మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ హెచ్చరించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ  పవన్‌కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ సర్కిల్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. మూలమర్రి తండా, దారావత్ తండా, తోక్ల తండా గ్రామాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టి,అనుమానాస్పదంగా ఉన్న ఇళ్లు, వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.అక్రమంగా నిల్వవుంచిన ఐదు వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు ముప్పై లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.నాటుసారా తయారీ, విక్రయానికి పాల్పడిన బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.తనిఖీల అనంతరం గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ తనిఖీల్లో  సీరోల్ ఎస్‌ఐ సంతోష్‌తో పాటు సుమారు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.