కృష్ణా వర్సిటీ మహిళా చెస్ ఛాంపియన్షిప్‌లో కేబీఎన్ కళాశాలకు విజయం
విజయవాడ, మేజర్ న్యూస్ : విజయవాడ సప్తగిరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కృష్ణా విశ్వవిద్యాలయ అంతర్ కళాశాల మహిళా చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో కేబీఎన్ కళాశాల విజయవాడ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. సప్తగిరి డిగ్రీ కళాశాల కార్యనిర్వాహక అధికారి, ప్రిన్సిపాల్ డా. ఆర్. రఘురామ్ అధ్యక్షతన జరిగిన ఈ పోటీల్లో సప్తగిరి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి, కరస్పాండెంట్ సీహెచ్ మన్మధరావు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఎస్‌డీఎంఎస్‌ఎం కళాశాల విజయవాడ ద్వితీయ స్థానాన్ని, కేవీఎస్‌ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ విజయవాడ తృతీయ స్థానాన్ని, ఏజీఎస్‌జీ సిద్ధార్థ కళాశాల ఉయ్యూరు నాలుగో స్థానాన్ని సాధించాయి. కృష్ణా విశ్వవిద్యాలయ వ్యాయామ సంఘ కార్యదర్శి బి.చి. సంగీతరావు పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.