BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర

Select Suryaa Now
గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : విజయవాడను గుంతలు లేని నగరంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరు రోడ్డులో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి రహదారులపై గుంతలు, మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, డివైడర్ల వద్ద గ్రీనరీని పరిశీలించారు. అవసరమైన చోట వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, మ్యాన్‌హోల్స్‌ను రోడ్డు స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూగర్భ డ్రైనేజీ పొంగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, డివైడర్ల వద్ద పరిశుభ్రతతో పాటు గ్రీనరీని పెంచాలని ఆదేశించారు. అనంతరం ధర్నా చౌక్‌లోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కమిషనర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నిర్వహణను మెరుగుపరచాలని సూచించారు. పర్యటనలో జోనల్ కమిషనర్ కే. ప్రభుదాస్, చీఫ్ సిటీ ప్లానర్ కే. సంజయ్ రత్నకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డా. పి. అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.