మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం
విజయవాడ సెంట్రల్ , మేజర్ న్యూస్ : టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారానికి చెందిన టీడీపీ కార్యకర్త మంద శ్రీనివాస్ (38) ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి కార్యకర్తల సహాయ నిధి నుంచి మంజూరైన రూ.1 లక్ష చెక్కును బొండా ఉమా అందజేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలకు, వారి కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవడం బాధ్యతని అన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.