BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన

Select Suryaa Now
ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన

అందుబాటులో లేని, వేరే ప్రాంతాలకు తరలిపోయిన, మరణించిన, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన పేర్లపై ప్రత్యేక దృష్టి

విజయవాడ, మేజర్ న్యూస్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా ఎ.ఎస్.డి.డి జాబితాలోని పేర్లపై అక్టోబర్ 8 నుంచి బూత్ స్థాయి అధికారులు మరోసారి ఇంటింటి పరిశీలన చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 24 వరకు నిర్వహించిన ఇంటింటి సర్వేలో జిల్లాలో 1,23,714 మంది ఓటర్లు అందుబాటులో లేని వారు, వేరే ప్రాంతాలకు తరలిపోయిన వారు, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువసార్లు నమోదైన వారిగా గుర్తించామని తెలిపారు. జూలై 31న ప్రచురించిన ముసాయిదా జాబితాలో 15,89,731 మంది ఓటర్లు ఉండగా, అక్టోబర్ 6 వరకు మరో 12,786 మంది అనర్హులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో మరోసారి ఇంటింటి పరిశీలనతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పరిశీలనలో పొరపాటున పేరు తొలగించబడినట్లు తేలితే సంబంధిత వ్యక్తి నుంచి ఫారం–6 ద్వారా దరఖాస్తు స్వీకరించి నిరంతర ఓటర్ల జాబితా నవీకరణలో భాగంగా తిరిగి ఓటరుగా నమోదు చేస్తామని వెల్లడించారు. అక్టోబర్ 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన పౌరులు తమ పత్రాలతో ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు కావాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.