విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం
విజయవాడ, మేజర్ న్యూస్ : విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవం, కళలు, సంప్రదాయాలను చాటే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్–2.0కు హాజరు కావాలని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) రాష్ట్ర మంత్రులను ఆహ్వానించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి కొలుసు పార్థసారథిలను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. కనకదుర్గమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, అదే స్ఫూర్తితో విజయవాడ నగర సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, పర్యాటక విశిష్టతలను ప్రపంచానికి చాటేలా విజయవాడ ఉత్సవ్–2.0ను ఘనంగా నిర్వహిస్తున్నామని చిన్ని తెలిపారు. గత ఏడాది ఉత్సవ్‌కు విశేష స్పందన లభించిందని, ఈసారి మరింత భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ ఉత్సవ్ ప్రతి విజయవాడ వాసి ఉత్సవమని, నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్వి పాల్గొన్నారు.
✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.