devotional
121 కిలోల బంగారు కానుక పటిష్టమైన 'బొక్కసం' భద్రత
టీటీడీ చరిత్రలో ఒకే భక్తుడు ఒకేసారి సమర్పించిన అతిపెద్ద ఆభరణాల కానుక ఇటీవలే నమోదైంది. వైఖానస ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తయారు చేయించిన 46 రకాల ఆభరణాలను (శ్రీవారికి 106 కిలోలు, పద్మావతీ అమ్మవారికి 15 కిలోల స్వర్ణ వస్త్రం) 9 సెట్లుగా టీటీడీకి అందజేశారు. ఇందులో 2,427 క్యారెట్ల నీలాలు, పుష్యరాగాలు, కెంపులు, పచ్చలు పొదిగిన 'శ్రీవత్సం' పతకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శ్రీవారి ఖజానాలో మూలవిరాట్టుకు సంబంధించి 150కి పైగా, ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి 400కి పైగా విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటన్నింటినీ టీటీడీ 'బొక్కసం' (ట్రెజరీ) విభాగం అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ప్రత్యేక రికార్డుల మధ్య నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటుంది. భక్తులు సమర్పించే ప్రతి కానుక స్వామివారి కైంకర్యాలలో భాగమై, తరతరాల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది