రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-అనంతపురం స్థానిక 3వ రోడ్డులోని సాయి విజ్ఞాన్ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏజీఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్–2026 నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు ఎం.పి. శ్రీనివాసులు, సి. కరుణాకర్ బాబు, ప్రధానోపాధ్యాయులు జి. లావణ్య రామ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థులు పాత వార్తాపత్రికలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, పెళ్లి పత్రికలు తదితర పునర్వినియోగ వస్తువులను సేకరించి అందించారు. నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు కిలోలు లేదా అంతకంటే ఎక్కువ వ్యర్థాలను అందించిన 52 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, 13 మందికి బ్యాడ్జీలు అందజేశారు. మొదటి తరగతి విద్యార్థి కె. విఘ్నేష్ ఇషాన్ బంగారు పతకం సాధించాడు. చదువుతోపాటు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించిన పాఠశాల యాజమాన్యానికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..