మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి
పరిగి మండలం కోడిగేనహళ్లి పంచాయతీ పరిధిలోని నూరానీ జామియా మసీదులో శుక్రవారం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ముస్లిం మతపెద్దలను, ముస్లిం సోదరులను ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ముస్లిం సోదరులతో ప్రేమాభిమానాలు పంచుకుంటూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని హృదయపూర్వకంగా కోరారు.కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ గ్రామంలోని ప్రతి ఇంటి అభివృద్ధి, ప్రతి కుటుంబం సంక్షేమమే తన లక్ష్యమని ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచే నమ్మకాన్ని బాధ్యతగా స్వీకరించి కష్టసుఖాల్లో అందరికీ అండగా ఉంటానని తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఖర్జూరం స్వీకరించి ఆప్యాయతను పంచుకున్నారు. మసీదులో సాగిన ఈ ఆత్మీయ కలయిక మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.