BREAKING
ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు... కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు..

హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్

Select Suryaa Now
హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్

 టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలోని బేగంబజార్ డివిజన్ సీతారాంబాగ్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ సందర్శించి, అధికారులతో పాటు ఓ అండ్ ఎం సిబ్బంది, ఆర్టిజన్లు, ఏఈలు, ఏడీఈల పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

కౌసర్, మంగళ్‌హాట్, దత్తాత్రేయ కాలనీ, సీతారాంబాగ్, చుడీబజార్ సెక్షన్ల వారీగా విద్యుత్ బిల్లుల వసూళ్లు, నిర్వహణ పనులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిని ఏమాత్రం సహించబోమని, పనితీరు మెరుగుపరచుకోని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి ఉద్యోగి డీ-లిస్ట్‌లోని పెండింగ్ విద్యుత్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, వినియోగదారులతో మర్యాదగా, పారదర్శకంగా వ్యవహరిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు విధులకు హాజరుకావాలని, ఇళ్ల లోపల ఉన్న విద్యుత్ మీటర్లను బయటకు మార్చే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు.

మంచి పనితీరు కనబరిచిన మంగళ్‌హాట్ సెక్షన్ ఫోర్‌మన్ హరిప్రసాద్, కౌసర్ సెక్షన్ ఫోర్‌మన్ ప్రసాద్‌లను సీఎండీ ప్రత్యేకంగా అభినందించారు.

హైదరాబాద్ సౌత్ సర్కిల్ పనితీరు మరింత మెరుగుపడేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని సీఎండీ స్పష్టం చేశారు. నిర్దేశించిన లక్ష్యాల సాధన, బకాయిల వసూళ్లు, నిర్వహణ పనులు, వినియోగదారుల సమస్యల పరిష్కారంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

ఈ సమీక్షలో డైరెక్టర్ (ఆపరేషన్స్) డాక్టర్ ఎన్. నర్సింహులు, మెట్రో జోన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ కర్ణాకర్ బాబు, హైదరాబాద్ సౌత్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.