BREAKING
బరేలీలో ఎస్‌టీపీఐ 75వ కేంద్రం ప్రారంభం అమెరికాలోని ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు ఐరోపా వ్యాప్తంగా సైనిక దూకుడు తగ్గించాలని పుతిన్‌ను కోరాను నేపాల్‌లోని ముస్తాంగ్ పాఠశాల మౌలిక వసతులకు భారత్ రూ. 8.9 కోట్ల నేపాలీ రూపాయల సాయం ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ మూడో గేమ్‌లో గుకేశ్ వ్యూహం అదుర్స్ సీఎస్ఐఆర్-ఐఐఐఎం జమ్మూకు డిడాక్ ఇండియా అవార్డు 2026 బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారానికి రెండేళ్లు ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ

రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య

Select Suryaa Now
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య

చిట్యాల మండలం గుండ్రాంపల్లి ;

సహకార సంఘాల ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు, వారి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ సంఘాల అభివృద్ధికి నూతన పాలకవర్గాలు కృషి చేయాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు

చిట్యాల మండలం గుండ్రాంపల్లి సింగిల్ విండో పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్‌గా బండ అంజయ్య నూతనంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు నూతనంగా ఎన్నికైన 13 మంది డైరెక్టర్లు నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సహకార సంఘం పనిచేయాలని అన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు. సంఘం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.