BREAKING
బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారానికి రెండేళ్లు ఉత్తరకాశీ అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి-గుండ్రాంపల్లి పీఏసీఎస్‌ నూతన చైర్మన్‌గా బండ అంజయ్య నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో ప్రతి 15 రోజులకు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం – సీఎండీ జితేష్ వి. పాటిల్ కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం బిజీ బిజీగా మేయర్ రెడ్డి అప్పలనాయుడు పార్టీ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. ఆటో డ్రైవర్‌కు పునర్జన్మ సరంపేటలో ఉచిత వైద్య శిబిరం…యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు... కంభంపాడులో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశం టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉయ్యూరి అప్పారావుకు మద్దతుగా ప్రచారం చేయాలి: ఎమ్మెల్యే తాతయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అరెస్ట్.. మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ

డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్

Select Suryaa Now
డిస్కంల కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపునకు ఆదేశాలు చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్) శ్రీ రంగనాథ్

 

కార్యాలయాల ఆవరణల్లో క్రమబద్ధత, పరిశుభ్రతకు ప్రాధాన్యత – 

హైదరాబాద్, నవంబర్ 27:టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లు, జోన్లు, ఈఆర్ఓ కార్యాలయాల ఆవరణల్లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను తక్షణమే తొలగించాలని చీఫ్ ఇంజనీర్ (ఎనర్జీ ఆడిట్ & అసెస్‌మెంట్స్) శ్రీ రంగనాథ్ ఆదేశించారు.

ఈ మేరకు సీఎండీ ఆమోదించిన మార్గదర్శకాలను అమలు చేయాలని సూచిస్తూ మెమో నంబర్ CE(EA)/SE(EA)/DE(EA)/D.No.486/26, తేదీ 25-11-2026 ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కార్యాలయాల ఆవరణల్లో పెద్ద, చిన్న ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడం వల్ల గందరగోళంగా కనిపిస్తున్నాయని, వాటన్నింటినీ వెంటనే తొలగించి, వాటి స్థానంలో సంస్థ విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి నెల ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగుల వివరాలను ప్రదర్శించేలా తగిన ప్రదేశంలో ఒక ప్రామాణిక సైజు ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని సూచించారు.

అనుమతి లేకుండా కార్యాలయాల ప్రవేశ ద్వారాల వద్ద లేదా ఇతర ప్రదేశాల్లో శాశ్వత ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన శాశ్వత ఫ్రేమ్‌లను కూడా తొలగించాలని ఆదేశించారు.

ఉద్యోగుల సంఘాలు, యూనియన్లకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగులను వారి కార్యక్రమాలు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తాత్కాలికంగా 3 నుంచి 4 రోజుల పాటు ఏర్పాటు చేసుకోవచ్చని, అనంతరం తప్పనిసరిగా తొలగించాలని తెలిపారు.

అదేవిధంగా అన్ని కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని, ప్రతి నెల ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగుల ఫొటోలను నోటీసు బోర్డులపై ఉంచాలని సూచించారు. సంస్థ సాధించిన ఉత్తమ విజయాలు, అత్యవసర సేవల నంబర్ 1912, ఎమర్జెన్సీ నంబర్లు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ (FOC) నంబర్లు, తప్పుగా వచ్చిన విద్యుత్ బిల్లులపై సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, సెక్షన్ కార్యాలయాల నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని ఆదేశించారు.

కార్యాలయ ప్రాంగణాల్లో అనధికారిక ఆక్రమణలు, సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా జెండాలు, గోడలపై పెయింటింగులు, శాశ్వత హోర్డింగులు ఏర్పాటు చేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ మార్గదర్శకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తీవ్రంగా పరిగణిస్తామని చీఫ్ ఇంజనీర్ శ్రీ రంగనాథ్ స్పష్టం చేశారు.