కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియామకం
భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ (Ministry of Ayush) (CCRUM) గవర్నింగ్ బాడీ మెంబర్‌గా శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ నియమితులయ్యారు.
ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రతాప్ రావు జాదవ్ కీ సింకారు శివాజీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సింకారు శివాజీ మాట్లాడుతూ, సంప్రదాయ యునాని మరియు ఆయుష్ వైద్య విధానాలపై పరిశోధనలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సామాన్య ప్రజలకు ఈ వైద్య సేవలు సులభంగా మరియు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు