BREAKING
మతసామరస్యానికి ఆత్మీయ పలకరింపు.. నూరానీ జామియా మసీదులో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? రీసైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సాయి విజ్ఞాన్ విద్యార్థుల ప్రతిభ డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు.. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తో గొట్టిపాటి లక్ష్మీ దంపతుల భేటీ కబడ్డీలో SVR విద్యార్థి బి.మహేంద్ర- ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక.. కళాశాల చైర్మెన్ వెంకటరామిరెడ్డి అభ్యంతరాలుంటే తెలియజేయాలి 121 కిలోల బంగారు కానుక పటిష్టమైన 'బొక్కసం' భద్రత అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారి పరిశీలన భారత్‌తో రెండో టెస్టు: తొలి రోజు ముగిసేసరికి న్యూజిలాండ్ 246/5 స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు..

Select Suryaa Now
డీలిమిటేషన్‌పై తగ్గేదేలేదు..

చెన్నై: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాలపై దేశంలో తొలుత గళమెత్తింది డీఎంకేనే అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై జాతీయ నేతలతో కలిసి తాము మొదట చెన్నైలోనే సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు.

లోక్‌సభ స్థానాలను పెంచినప్పటికీ, పార్లమెంటులో తమిళనాడుకు ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గకూడదని స్టాలిన్ డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు యథాతథంగా కొనసాగించాలని ఆయన కోరారు. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం, జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) నిర్ణయాలకే తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని స్టాలిన్ తేల్చి చెప్పారు.