BREAKING
పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన అవసరం : ఆచార్య జి.నాగరాజు సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదీ: నాగార్జునరెడ్డి పీవి ధ్వయం జీవన రేఖలు పుస్తకావిష్కరణ

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌

Select Suryaa Now
సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్‌
సైబరాబాద్,మేజర్ న్యూస్ :  సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌ పెట్టేందుకు పోలీసులు కొత్త కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే వన్‌వే విధానాన్ని అమలు చేయడంతోపాటు ప్రత్యేకంగా బస్‌ లేన్లను ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు విజయవంతం కావాలంటే ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సైబరాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎంసీ, సైబరాబాద్‌ పోలీసులు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సైబరాబాద్‌ మూవ్స్‌-2026’ సదస్సును గురువారం  డీజీపీ సి.వి.ఆనంద్  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లండన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శశివర్మ, బొగోటా మేయర్‌ ఎన్రిక్‌ పెనలోసా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబరాబాద్‌ సీపీ రమేశ్‌తోపాటు ఐటీ కంపెనీల ఉద్యోగులు, విద్యార్థులు, స్టార్టప్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు వివిధ సంస్థలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అతిథులతో కలిసి డీజీపీ పరిశీలించారు.ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు కీలక కూడళ్ల అభివృద్ధిపై సైబరాబాద్‌ పోలీసులు, సెక్యూరిటీ కౌన్సిల్‌, లివింగ్‌ ల్యాబ్‌ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గత రెండు దశాబ్దాల్లో సైబరాబాద్‌ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ఇక్కడ సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో దాదాపు 80 శాతం మంది వ్యక్తిగత వాహనాలపైనే కార్యాలయాలకు వస్తుండటంతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరుగుతోందన్నారు.పోలీసులు, సీఎంసీ ఇప్పటికే పలు చర్యలు చేపట్టినప్పటికీ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదని పేర్కొన్నారు. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను కొంతమేర నియంత్రించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘సైబరాబాద్‌ మూవ్స్‌-2026’ సదస్సు ట్రాఫిక్‌ సమస్యకు ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.