BREAKING
మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు

మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం

Select Suryaa Now
మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం
తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం చేస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మహిళలు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఉన్నత పదవులు చేపట్టేలా అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘మహిళలు–రాజ్యాంగం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26 మహిళలకు నిజమైన పండుగ వంటిదని పేర్కొన్నారు. వేల ఏళ్లుగా మహిళలను వస్తువులుగా, ఆస్తులుగా చూసిన సమాజంలో రాజ్యాంగమే వారికి సమాన హక్కులు, గౌరవం కల్పించిందన్నారు. ప్రతి ఇంట్లో మత గ్రంథాలతోపాటు రాజ్యాంగం కూడా ఉండాలని, మహిళలు దానిని చదివి తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆస్తి హక్కులు, ఉద్యోగాలు, సమాన వేతనాలు, ఆర్థిక స్వేచ్ఛ విషయంలో మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు, అవమానకర వ్యాఖ్యలు ఆగాలని, రాజకీయాల్లోకి వచ్చే మహిళలు విమర్శలకు భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు కీలక పాత్ర పోషించినప్పటికీ వారి చరిత్రకు తగిన గుర్తింపు లభించలేదని, మన చరిత్రను మనమే రాసుకోవాలని అన్నారు. మహిళలకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, స్వావలంబన సాధించినప్పుడే వారు అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషిలో ఫాతిమా షేక్ అందించిన సహకారాన్ని గుర్తుచేశారు. మహిళలకు పనిలోనే కాకుండా రాజకీయ పదవుల్లోనూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సనత్ నగార్ ఇంన్చడ్జ్  కడెం అర్చన, కవెటి సవిత మనోహర్, సండ్ర మాలతి, శ్రావణి, రష్యా బేగం, లలితా యాదవ్, పరమేశ్వరి, సౌజన్య, పిట్ల విజయలక్ష్మి, శ్రావణి ముదిరాజ్, సౌజన్య రెడ్డి, పద్మజ, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.