పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్
తెలంగాణ బ్యూరో , ప్రతినిధి : భారతదేశపు ప్రతిష్టాత్మకమైన ప్యాకేజ్డ్ తాగు నీటి బ్రాండ్స్ లో ఒకటియైన క్లియర్ ప్రీమియం వాటర్ సురక్షితమైన మరియు పరిశుభ్రమైన తాగు నీటిని వినియోగదారులకు అందించడానికి తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ఈ సిద్ధాంతాన్ని బలోపేత్తం చేస్తూ, బ్రాండ్ హృతిక్ రోషన్ నటించిన తమ తాజా టీవీసీ ని ఆవిష్కరించింది. దీని ద్వారా రోజూ తాగే నీటి విషయంలో అవగాహనతో కూడిన నిర్ణయాలు చేసే ప్రాధాన్యతను తెలియచేసింది. బ్రాండ్ మనుష్యుల జోక్యం లేని, బహుళ దశల ప్యూరిఫికేషన్ మరియు కఠినమైన నాణ్యతా తనిఖీలతో పూర్తి స్వయంచాలిత బాటిలింగ్ ప్రక్రియను అనుసరిస్తుంది, తన కార్యకలాపాల్లో స్వచ్ఛత మరియు భద్రతలు ఉండటంపై సంస్థ ఇచ్చిన ప్రాధాన్యతను నిర్థారిస్తోంది. శక్తివంతమైన పాన్-ఇండియా ఉనికితో, క్లియర్ 200 మి.లీ, 500 మి.లీ మరియు 1లీ బాటిల్స్ సహా తమ ప్యాక్ సైజ్ ల శ్రేణి ద్వారా విభిన్నమైన వినియోగదారు అవసరాలను నెరవేరుస్తోంది. దీని ఉత్పత్తి యొక్క పోర్ట్ ఫోలియో మరియు విస్తరిస్తున్న పరిధి మార్కెట్లలో వినియోగదారులకు నమ్మకమైన మరియు సురక్షితమైన ప్యాకేజ్డ్ తాగు నీటిని తయారు చేసే బ్రాండ్ యొక్క కలను సూచిస్తోంది. డీవీసీ విడుదలపై నయన్ షా, క్లియర్ ప్రీమియం వాటర్ ఫౌండర్ & సీఈఓ మాట్లాడుతూ “క్లియర్ బాటిల్ ను ఎవరైనా తీసుకున్న ప్రతిసారి, వారు మాపై తమ నమ్మకాన్ని ఉంచుతారు. ఎలాంటి రాజీ లేకుండా పరిశుభ్రత, స్వచ్ఛత మరియు భద్రతలు యొక్క ఉన్నతమైన ప్రమాణాలను సమర్థించడం ద్వారా ఆ నమ్మకాన్ని గౌరవించడం మా బాధ్యతగా మేము భావిస్తాము. ” అని అన్నారు . కొత్త టీవీసీ సంస్థ వారి ‘పానీ హో తొహ్ క్లియర్ ’ కాంపైన్ యొక్క విస్తరణ, వినియోగదారులు తాము తినే ఆహారం పరిశుభ్రత గురించి అప్రమత్తంగా ఉన్న విధంగానే తాగు నీటి విషయంలో కూడా ఉండటానికి ఈ ప్రచారం ప్రోత్సహిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్ గా హృతిక్ రోషన్ క్లియర్ లో వినియోగదారుల ఆత్మవిశ్వాసాన్ని మరియు ప్రతి బాటిల్ వెనక ప్రమాణాలను శక్తివంతం చేసారు. కాలక్రమేణా, ఈబీపీఎల్ వైవిధ్యభరితమైన పానియాల సంస్థగా పెరిగి తన బ్రాండ్స్ పోర్ట్ ఫోలియో ను విస్తరించింది. బ్యాకేజ్డ్ తాగు నీటికి మించి, దీని ప్రీమియం పోర్ట్ ఫోలియోలో ఉన్న కెల్జాయ్ సహజమైన మినరల్ వాటర్, వోల్కానిక్ నీటిని అందిస్తుండగా, చిట్కాహ్ కార్బొనేటెడ్ పానియాల విభాగానికి సేవలు అందిస్తోంది. కంపెనీ తమ ప్యాకేజింగ్ సామర్థ్యాలను కూడా విస్తరించింది, 100 శాతం రీసైకిల్ చేసిన పి ఈ టీ బాటిల్ శ్రేణిని 2025లో పరిచయం చేసింది, ప్యాకేజింగ్ ఆవిష్కరణ మరియు సుస్థిరతపై తమ ప్రాధాన్యతను సూచించింది.