BREAKING
మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి అభ్యంతరాలుంటే తెలియజేయాలి వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మూసాపేట లేఅవుట్ ఈ-వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. స్టే ఉత్తర్వులు లేవు! సూప్‌లో బొద్దింకలు.. జిస్మత్ మండి రెస్టారెంట్‌పై చర్యలు

వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

Select Suryaa Now
వెంకటేశ్వరుడి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్
జీడిమెట్ల మేజర్ న్యూస్ భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాద క్షేత్ర ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గురువారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 132 జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్ నగర్ ఫేజ్-2లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆధ్యాత్మిక భావనతో ఐకమత్యంగా ముందుకు సాగుతూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. దేవాలయాలు ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాలనీ వాసులు, భక్తులు కలిసి నిర్వహించిన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కోశాధికారి మల్లీశ్వర్ రావు, వసంత్ కుమార్‌తో పాటు కాలనీ వాసులు, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.