BREAKING
స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా ఎదగాలి** ప్రభుత్వ విప్ వేముల వీరేశం మురుగు కూపం నుంచి సరికొత్త శోభతో మాదాపూర్ సున్నం చెరువు పెద్దపల్లి పంచాయితీపై ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్ ఫోకస్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం మంతటి గ్రామస్తులకు అండగా ఉంటా.. ఇళ్ల సమస్యను పరిష్కరిస్తా: చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సీవోపీడీని తొలిదశలో గుర్తిస్తే ఊపిరితిత్తుల నష్టాన్ని తగ్గించవచ్చు, వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు శేరి సతీష్ రెడ్డి నివాళి సైబరాబాద్‌ మూవ్స్‌–2026కు 200 మందికి పైగా ప్రతినిధులు పానీ హో తొహ్ క్లియర్ ’ విడుదల చేసిన హృతిక్ రోషన్ డిజిటల్ ఆస్తులపై సంపన్నుల ఆసక్తి బిట్‌డెల్టా ఇండియా నివేదికలో వెల్లడి పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమసేన’గా నామకరణం కొత్త రుచులతో మాయా ది కేఫ్‌కు శ్రీకారం అభ్యంతరాలుంటే తెలియజేయాలి

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

Select Suryaa Now
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల

(రేపు ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటా• 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు• డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ–డిప్ నమోదు)

తిరుమల, సూర్య ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

టికెట్లు, టోకెన్ల విడుదల వివరాలు:

 * నవంబర్ 28 (రేపు): ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

 * నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

 * డిసెంబర్ 1 నుంచి 5 వరకు: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు (డిసెంబర్ 20, 21) సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం డిసెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఈ–డిప్ (e-Dip) విధానంలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

 * డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ–డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు.

 * డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లను విడుదల చేస్తారు.

తొలి రెండు రోజులు వీఐపీ, రూ.300 దర్శనాలు రద్దు:

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలైన డిసెంబర్ 20, 21 తేదీల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే, ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేశారు. భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా మాత్రమే టికెట్లు, టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.