BREAKING
తట్టేపల్లి వద్ద విద్యార్థుల ఆందోళన.. సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ లాట్వియా గగనతలంలోకి గుర్తుతెలియని డ్రోన్.. అప్రమత్తమైన నాటో యుద్ధ విమానాలు: మెర్సిడెస్-బెంజ్ చైనాలో కొత్త సంయుక్త సంస్థ.. విడిభాగాల తయారీ, సరఫరాపై ప్రత్యేక దృష్టి: సౌదీ అరాంకో చమురు శుద్ధి కేంద్రంపై దాడి.. పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు యూరోపియన్ సమాఖ్య దీర్ఘకాలిక బడ్జెట్‌పై ఏడాది చివరికల్లా ఒప్పందం.. నిర్మాణ పరికరాల మార్కెట్‌కు భారీ ఊతం.. విదేశీ పెట్టుబడుల వెల్లువతో భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలు.. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం పతనం.. దేశీయ మార్కెట్లకు స్వల్ప బలహీన ప్రారంభ సంకేతాలు: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒత్తిడి! జపాన్ మార్కెట్‌లో మళ్లీ కొనుగోళ్ల జోరు.. 0.4 శాతం పెరిగిన నిక్కీ: ఏఐ, సెమీకండక్టర్ షేర్లలో రికవరీతో పుంజుకున్న సూచీ! శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్ నియామకం అమెరికా తూర్పు తీరాన్ని వణికించిన భారీ తుపాను.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం వివరాల సేకరణ పరిశీలన -- ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, పీపీపీలపై ప్రధాని మోదీ దృష్టి న్యూజిలాండ్‌లో అధికారానికి ఒక సీటు దూరంలో పాలక కూటమి

పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు

Select Suryaa Now
పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు

పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు

- సీసీ కెమెరాలు ధ్వంసం..
- అనుమానిత పూజారి బాలాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

– చీరాల: పేరాల పెద్ద రథం  సెంటర్‌లోని ఆంజనేయ స్వామి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టిన ఘటన పట్టణంలో కలకలం రేపింది. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది.గతంలో ఈ ఆలయంలో పూజారిగా పనిచేసిన బాలాజీపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండో పట్టణ సీఐ శశికుమార్ విచారణ చేపట్టారు. పేరాల సెంటర్‌లోని ఓ టిఫిన్‌ హోటల్‌ వద్ద ఉన్న బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.గతంలో ఆలయ నిర్వాహకులు బాలాజీని పూజారి విధుల నుంచి తొలగించి మరో వ్యక్తిని నియమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకుని ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని స్థానికులుఅనుమానిస్తున్నారు.