BREAKING
వారణాసిలో నేడు కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభోత్సవం మాటలు చెప్పడానికి కాదు.. అభివృద్ధి చేసి చూపించడానికి వచ్చా: ప్రవీణ్ రెడ్డి! కోడిగేనహళ్లిని నంబర్ వన్‌గా తీర్చిదిద్దడమే నాలక్ష్యం.. పదవి కోసం కాదు.. పుట్టి పెరిగిన గడ్డకు సేవ చేయడానికే పోటీ.. శనివారం సుబ్బరాయునిపల్లి కాలువపల్లిలో విస్తృత ప్రచారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిజోరం, నాగాలాండ్ పర్యటన తిరుప్పరంగున్రం దీపం వివాదం వేళ మురుగన్ భక్తి నినాదం పంచుకున్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ శాంతి, ఇండో-పసిఫిక్ భద్రత, ఉగ్రవాదంపై భారత్-ఈయూ ఉమ్మడి నిబద్ధత బిమ్‌స్టెక్ అండర్-23 అథ్లెటిక్స్ 2026లో భారత్ అగ్రస్థానం ఐఐటీఎఫ్ 2026లో సీబీఐసీ జీఎస్టీ అండ్ కస్టమ్స్ పెవిలియన్‌కు కాంస్య పతకం బెంగళూరులో 65వ ఐసామ్ వార్షిక సదస్సు కార్తీక దీపం అంటుకుని యువతి మృతి జగన్మోహిని ఆలయంలో ప్రత్యేక పూజలు ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు హోటల్ గదిలో గుంటూరు యువకుడి అనుమానాస్పద మృతి అల్లాపల్లి పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి జయం జగదీష్ విస్తృత ప్రచారం --------- కత్తెర గుర్తుకు ఓటు వేయాలని వినతి జిల్లావ్యాప్తంగా పోలీసుల మెరుపు తనిఖీలు.. 1,019 వాహనాల తనిఖీ, రూ.1.28 లక్షల జరిమానా ఓటుకు నోటు.. గెలుపే గురి! పంచాయతీ పోరులో ధనప్రవాహంపై ఆందోళన సర్పంచి బరిలో రూ.లక్షల్లో ఖర్చుపై ప్రచారం

గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకులు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం

Select Suryaa Now
గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకులు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం

సూర్యా కోనసీమ డెస్క్ గేదెల్లంక: గేదెల్లంక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన నాయకుడు గుద్దటి జమ్మి గారి సతీమణి శ్రీమతి కాశీ తులసి రత్నం ఘన విజయం సాధించారు. కూటమి మద్దతుతో కత్తెర గుర్తుపై పోటీ చేసిన ఆమె, సమీప వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడిపై 126 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో గేదెల్లంక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కాశీ తులసి రత్నం మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గేదెల్లంక అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా రహదారులను మెరుగుపరిచి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, మురుగునీటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పారిశుధ్యం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని తెలిపారు.

అలాగే, త్రివేణి సంగమం వద్ద స్మశానవాటిక నిర్మాణానికి కృషి చేస్తామని, స్థానిక ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. రానున్న పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమ ప్రాంతంలో అవసరమైన అభివృద్ధి పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే సర్పంచ్‌గా సేవలందిస్తానని, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తానని ఆమె తెలిపారు.

కాశీ తులసి రత్నం విజయం పట్ల జనసేన, కూటమి మద్దతుదారులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.